భక్తుల అనుభవాలు
- పేరు: కృష్ణ మూర్తి
- వృత్తి: రిటైర్డ్ డీఎస్పీ అధికారి
నా పేరు కృష్ణ మూర్తి. నేను ఒక రిటైర్డ్ డి ఎస్ పి. ఆరోగ్యము, ఆనందము, ఆధ్యాత్మికం గురించి గురువు గారు చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరు గుణవంతులుగా, ఆరోగ్యవంతులుగా ఉండాలి అని చెప్పిన విషయాలు చాలా అద్భుతముగా అనిపించింది. ఈ ఆరోగ్యము, గుణము ముఖ్యముగా గురువు గారి ఆశీసులతోనే నేర్చుకోవడం జరిగింది. మనిషికి గుణం, ఆరోగ్యము గొప్పవి.
వయసు పై బడిన వారి గురించి గురించి, ఉమ్మడి కుటుంబాల గురించి చాలా బాగా వివరించారు గురువు గారు. మనిషి యొక్క మానసిక రుగ్మతలు కుడా మానవుని ప్రగతికి అవరోధాలు కాబట్టి మనకి ఆరోగ్యం చక్కగా ఉన్నపుడే వాటిని మనం జయించగలం అని ఈ సత్సంగంలో చక్కగా వివరించారు. ఆరోగ్యం, యోగ, ప్రాణాయామ గురించి చక్కగా వివరించారు.
సాధారణంగా రిటైర్డ్ అయిన వారు కొన్ని విషయాలకు లొంగిపోవడానికి ఆస్కారం ఉంటుంది అటువంటివి లేకుండా అత్యునతంగా జీవించడానికి ఈ యొక్క సత్సంగం అత్యద్భుతముగా ఉపయోగపడుతుంది. ప్రతి గ్రామములో, కాలనీ లో ఇటువంటి విషయాలని తెలియాచేస్తే అందరు ఉన్నతంగా తయారు అవుతారు.
ఈ సత్య మార్గమును ప్రతి ఒక్కరు ఆస్వాదించుతారు అని కోరుతున్నాను . ముఖ్యము గా వయసు మీద పడిన తర్వాత వచ్చే రుగ్మతలను దాటేయచ్చు అని చక్కగా వివరించారు. ముద్రలు, పూర్వం ఋషులు చెప్పిన కొన్ని విషయాలను కూడా చక్కగా చెప్పారు. ఆరోగ్యము బాగునపుడే మనం బాగుంటాము, ప్రపంచం బాగుంటుంది అని నేను నమ్ముతాను.
గురువు గారు ఇలాంటి టాపిక్ ఎంచుకొని అందరికి మంచి చేయాలి అనుకునే ఆలోచన అందరిలోకి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను.