
భక్తుల అనుభవాలు
- పేరు : దుర్గారావు
- వృత్తి: రిటైర్డ్ BDL ఉద్యోగి
నా పేరు దుర్గ రావు. ఈ సత్సంగం రిటైర్డ్ ఆయన పెద్ద వాళ్ళ చాలా బాగా చెప్పారు. రిటైర్డ్ అయ్యాక ఒకరి మీద ఆధారపడకుండా వారికీ వారే ఎలా జీవించాలి అనేది చాలా వివరంగా చెప్పారు చాలా బాగా అనిపించింది. మనకి వచ్చిన అమౌంట్స్ లోనే ఎలా హ్యాపీ గా ఉండాలి భక్తి మార్గము లో, మంచి మార్గం లో ఎలా ఉండాలి కూడా చక్కగా చెప్పారు. మేము ఆ విధము గా ఉండటానికి ప్రయతినిస్తాము.
ఈ సత్సంగం మళ్ళీ ఒకసారి అవకాశం ఉంటె వినిపిస్తారని అనుకుంటున్నాము. వీక్లీ ప్రోగ్రామ్స్ పెడితే మాకు వినడానికి ఈజీగా ఉంటుంది మరియు దీని గురించి ఎక్కువగా తెలుసుకున్న వాళ్ళము అవుతాము.
మీరు నిన్న జరిగిన ప్రోగ్రాంలో వయసు పై బడిన వాళ్ళ గురించి చెప్పారు అది చాలా బాగుంది. ఇది వయసు మీద బడిన అందరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడకుండా వారి పనులు వాళ్ళే చేసుకునేల మార్గదర్శకత్వం ఇచ్చారు. పిల్లలు వాళ్ళ పనుల ఒత్తిడి వల్ల ఆదరించలేకపోవచ్చు, ఎపుడో ఒకసారి రావచ్చు, దాని గురించి తల్లి తండ్రులు బాధ పడకుండా ఎలా జీవించాలి అనేది చెప్పారు అది నాకు చాలా బాగా నచ్చింది.
గురువు గారికి మా వందనములు.