భక్తుల అనుభవాలు
దైవిక క్షణాలు: భక్తులు తమ పరివర్తన అనుభవాలు
- పేరు: కిషోర్ బాబు
- వృత్తి: రిటైర్డ్ జడ్జి
గురువు వారికి నమస్కారములు. నా పేరు కిషోర్ బాబు. గురువు గారు ఆరోగ్యం గురించి చాలా బాగా వివరించారు. ఆరోగ్యం ఎక్కడో బైట లేదు అది మన ఇన్నర్ బాడీ లోనే ఉంది. మన యొక్క శరీర అవయలతో చిన్న చిన్న టిప్స్ చేసుకుంటే అవి మనకి ఎంతో ఆరోగ్యకరం గా ఉపయోగ పడ్తుంది అని చెప్పారు. మనం కూర్చున్న చోట నే చేస్కునే విధం గా వివరించారు. ఇక రాను రాను కార్యక్రమములో మరి ఎన్నో విషయాలు తెలుస్కోవచ్చు అని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమము ఎంతో ఉపయోగకరంగా ఉన్నది మరి ముఖ్యముగా రిటైర్డ్ వాళ్లకి చాలా ఉపయోగపడ్తుంది. సత్సంగం టైం కి స్టార్ట్ చేసి అనుకున్న టైం కి కంప్లీట్ చేసేవిధంగా ఉండాలి అని అనుకుంటున్నాను.