భక్తుల అనుభవాలు
- పేరు: దయాకర్
- వృత్తి: ఉపాధ్యాయుడు
నా పేరు దయాకర్. సీనియర్ సిటిజన్స్ కోసం నిన్న చెప్పినటువంటి ఆరోగ్యము, ఆనందము, ఆధ్యాత్మికం అనే సత్సంగం చాలా బాగుంది. ఇంత మంచి ప్రోగ్రామ్ లో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి, నిర్వహించిన సంస్థకి, బృందం కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.
సమాజం సక్రమమైన మార్గంలో వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరికి దేశం పట్ల గౌరవం, పెద్దల పట్ల గౌరవం ఉండటం ముఖ్యం అలాంటి సూచనలు బాగున్నాయి. ఇన్ని రోజులు ఇలాంటి జ్ఞానం వినలేకపోయాం.
ఇక నుంచి ఇలాంటి సత్సంగాలు పదిహేను రోజులకి ఒకసారి గురువు గారి సమయాన్ని మాకు అనుగుణంగా అనుగ్రహిస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది అని కోరుతున్నాము. నేను అయితే ఇలాంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం అని భావిస్తున్నాను. ఇది ఎక్కువ మందికి అందేలాగా గ్రూప్స్ తయారు చేసి వాళ్ళందరికి ఇలాంటి చక్కనైన జ్ఞానమును అందిచాలి అని మనస్ఫూర్తిగా కోరుకుతున్నాను.
గురువు గారికి నా ప్రత్యేకమైన వందనములు.